ఫామ్ హౌస్ పాలిటిక్స్.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..
TG: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ రెడీ చేసుకున్న నిరసన వ్యూహం.. తాతా మధు వివాదాస్పద కామెంట్స్‌తో ఒక్కసారిగా రూట్ మారింది. స్పీకర్‌పై ఆయన చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై వివాదం చెలరేగడం, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అసలు ప్రజా సమస్యలు తెరమరుగయ్యాయనే వాదన వినిపిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ వేసిన రాజకీయ ఎత్తుగడ.. చివరకు ఆ పార్టీతో పాటు కాంగ్రెస్‌కూ తలనొప్పిగా మారిందా? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ క్రమంలో కేసీఆర్ మరణాన్ని కోరుకునేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో బీఆర్‌ఎస్‌పై వచ్చిన విమర్శల కంటే కాంగ్రెస్ చర్యలపైనే చర్చ ఎక్కువగా సాగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు చిన్నగా మొదలైన రాజకీయ పోరు.. చివరకు రెండు పార్టీలకూ నెగిటీవ్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై జరగాల్సిన అసలు చర్చ కాస్తా వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణల వైపు మళ్లడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
