"గజం ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే ఇచ్చేస్తా.." సీఎం రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్
TG Politics: శాసనసభ వేదికగా 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన ఆమె, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నేరుగా ప్రభుత్వానికే సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికంటే ఒక్క గజం భూమి తనకు అదనంగా ఉన్నట్లు తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రుజువైనా ఆ భూమిని తక్షణమే సర్కార్కే సరెండర్ చేయడానికి సిద్ధమని తెగేసి చెప్పారు.సభలో 22A భూములపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా పరిధిలో కవిత, ఆమె భర్త పేరిట ఏకంగా 37.26 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. తన కుటుంబానికి ఎక్కడెక్కడో భూములు ఉన్నట్లు సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
