తెలంగాణ
సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే : హరీష్ రావు
TG Politics: తెలంగాణ శాసనసభలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తన వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పథకం ప్రకారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తామనే భయంతోనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ లోక్‌సభకు టీ-షర్టులు, స్టిక్కర్లతో వెళ్తే తప్పులేదు కానీ, ప్రజా సమస్యలను టీ-షర్టులపై రాసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బూతు పదాలంటూ సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు
