తెలంగాణ

TG Politics: మిత్రపక్షాల చేతుల్లోనే కాంగ్రెస్ భవిష్యత్తు.. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ ఏం చేయబోతున్నాయి?

TG Politics: తెలంగాణలో రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. అభ్యర్థుల పేర్లను అందరికంటే ముందుగానే ప్రకటించి దూకుడు ప్రదర్శించిన హస్తం పార్టీకి.. ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు కూడగట్టుకోవడమే అతిపెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన మిత్రపక్షాలు ఈసారి ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ వెంట నడుస్తాయా లేక సొంతంగా పోటీకి దిగి షాక్ ఇస్తాయా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి (టీజేఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ఐక్యత కొనసాగింది.