TG : కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..
TG : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించిన తర్వాత సుమంత్‌ను ముందస్తు బెయిల్‌పై రిలీజ్ చేయాలని దర్యాప్తు అధికారికి సూచించింది. అలాగే కేసులోని ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను ప్రభావితం చేయడం, వారిని ప్రలోభపెట్టడం లేదా బెదిరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోర్టు షరతు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేసుకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
మరో కీలక నిబంధనగా.. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా సుమంత్ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. తన మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వివరాలను దర్యాప్తు అధికారికి అందించాలని సూచించింది. అడ్రస్ లేదా తనను అప్రోచ్ అయ్యే వివరాల్లో ఏదైనా మార్పు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
