తెలంగాణ
ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఉచిత పథకాలపై ఆందోళన!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో త్వరలోనే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాలో నిధులు ఖాళీ అవడానికి ఈ ఉచితాలే ప్రధాన కారణమని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు సర్‌ఛార్జి బకాయిల చెల్లింపునకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘కోటీశ్వరులకు కూడా రైతుబంధు ఇవ్వడం, భారీ లగ్జరీ బైక్‌లపై తిరిగే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం వెనుక అర్థమేంటి?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది.
