తెలంగాణ
TG High Court: కోటీశ్వరులు కూడా లబ్ది పొందుతున్నారు, భవిష్యత్ తరాలకు ఏం మిగులుస్తారు- ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సమాజంలోని పలు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఆర్థిక భరోసా కల్పించేలా కొన్ని స్కీమ్స్ ను తీసుకొచ్చాయి. అయితే, పేదల కోసం తెచ్చిన ఉచిత పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని, సంపన్నులు సైతం లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఒక కేసు విచారణ సందర్భంగా.. ఉచిత పథకాల అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.
