తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నిన్న రాత్రి ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్ర‌భావం కారణంగా నేడు, రేపు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌గిత్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, భద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నిర్మ‌ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు.