తెలంగాణ
TG: ‘పబ్ ఘటనపై FIR ఎందుకు నమోదు కాలేదు?’: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
TG: హైదరాబాద్‌లో జరిగిన పబ్ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ యువ నేతలు పబ్బుల్లో మునిగి తేలుతుంటే.. నగర పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
