తెలంగాణ
కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ లీడర్లు
Politics : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నిరసనలో భాగంగా డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వరదరాజపూర్ మీదుగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం పార్టీ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపానికి చేరుకునే ప్రయత్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్ పార్టీతో వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.
