తెలంగాణ

దసరా సెలవులు ఓవర్.. పల్లెలు విడిచి పట్టణాలకు ప్రజలు!

రాష్ట్రంలో దసరా సెలవులు ముగిశాయి. నిన్నటివరకు కుటుంబంతో సరదాగా గడిపిన వారంతా నేడు పట్టణాలకు తిరుగుప్రయాణం అవుతున్నారు. బతుకుదెరుకు కోసం నగరాలకు వలస వెళ్లి పండక్కి సొంతూర్లకు వెళ్లినవారంతా తిరుగుప్రయాణం అవుతున్నారు.దీంతో పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పండుగ సమయంలో భార్యబిడ్డలతో సొంతూర్లకు రావడంతో కళకళలాడిన గ్రామాలు.. మళ్లి బోసిపోనున్నాయి. సెలవులు ముగియడంతో జనాలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది నగరానికి వచ్చారు. నేటితో సెలవులు ముగుస్తుండటంతో పిల్లలతో కలిసి పేరెంట్స్ తిరుగు ప్రయాణం కావడంతో నగరానికి ట్రాఫిక్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌కు వచ్చే ప్రధాన రాహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.