తెలంగాణ
TG : ‘బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?’.. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ఆందోళన!
TG : సచివాలయంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏళ్లు గడుస్తున్నా తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. "మా బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?" అంటూ నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించడంతో సచివాలయ కారిడార్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బాధితుల వివరాల ప్రకారం.. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వివరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
