తెలంగాణ
అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దూకుడు.. ప్రజా సమస్యలు బైపాస్!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర విమర్శలు సభా కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన వేదిక రాజకీయ ఆందోళనలకు కేంద్రంగా మారిందనే అభిప్రాయాలు సామన్య జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజున బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనలకు దిగారు. టీషర్టులు విప్పి తమ నిరసనను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అనంతరం సభలో తీర్మానాలు, సభ్యుల సస్పెన్షన్ల అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
