తెలంగాణ

TG : ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు డిలీట్?

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రకియ పూర్తయ్యే వరకు సుమారు 60 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, వలసలు పోయిన వారి ఓట్లను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లు మారిన ఓటర్ల వివరాలు సేకరించడంలో బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.ఇక చనిపోయినవారు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడకు పని కోసం వచ్చిన వారికి ఓట్లు ఉంటే వాటిని కూడా గుర్తించి తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారామ్స్ సమర్పణకు కేవలం ఐదు రోజులే సమయం ఉంది.