తెలంగాణ
TG: తెలంగాణలో 369 కొత్త ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!
TG: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.
హైదరాబాద్లో 200 ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్కో ఏర్పాటు చేసిన 200 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు.
