తెలంగాణ
TG: నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత భూముల జాబితా పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్నారు. విపక్షాల విమర్శలకు బదులివ్వడంతో పాటు గత ప్రభుత్వంలో 22-A పేరుతో జరిగిన భూ అక్రమాలను వెలికితీసి, బాధితులకు ఊరట కల్పించేలా స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సభ ముందుంచనుంది. అయితే, అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల సమస్యపై చేపట్టే స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సివుంది.
