టాప్ న్యూస్

TG : ఇందిరమ్మ ఇళ్ల టెన్షన్.. రోడ్డున పడ్డ 20 వేల మంది క్యాబ్ డ్రైవర్లు?

ఇందిరమ్మ ఇళ్లులు లబ్దిదారుల పాలిట శాపంగా మారాయని ప్రచారం జరుగుతోంది. బిల్లులు రాక చాలా మంది లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు నరకం చూస్తున్నట్టు తెలుస్తోంది. వారిని కారు ఓనర్లుగా పరిగణిస్తూ అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదని సమాచారం. దీంతో కొందరు కారు అమ్ముకుని బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగున్నట్టు తెలిసింది. జీవనోపాధి కోసం క్యాబ్‌లు, మినీ వ్యాన్లు నడుపుతూ, ఉండేందుకు ఇళ్లు లేక ఇందిరమ్మ ఇల్లు కోసం పలువురు క్యాబ్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా..దరఖాస్తు సమయంలో వారిని అర్హులుగా ప్రకటించిన అధికారులు.. ఇల్లు నిర్మించుకున్నాక బిల్లు మంజూరు చేసే సమయంలో మీకు సొంత కారు ఉంది అని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్టు తెలిసింది.