తెలంగాణ

TG: కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 18మంది విద్యార్థినులకు అస్వస్థత!

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి 18 మంది బాలికలు తీవ్ర తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.