తెలంగాణ
TG : ఆగస్టు 15 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.
