తెలంగాణ

TG:తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. రేవంత్‌ ఆదేశాలు

TG: తెలంగాణలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావిధానానికి ప్రభుత్వం స్వస్తి పలకబోతోందా? అంటే అవుననే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యావ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్, ప్రత్యేక జూనియర్ కాలేజీల వ్యవస్థ స్థానంలో పాఠశాలల్లోనే ‘10+2’ విధానాన్ని తీసుకొచ్చేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త 10+2 విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.