తెలంగాణ

Bathukamma Celebrations: టెక్సాస్‌లో 15 వేల మందితో బతుకమ్మ సంబరాలు!

Bathukamma Celebrations: అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని ప్రతిష్టాత్మక 'కొమెరికా సెంటర్' వేదికగా 'టి-ప్యాడ్' (TPAD) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఏకంగా 15 వేల మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా పండుగ శోభతో వెలిగిపోయింది. పొద్దున మొదలైన ఆటపాటలు రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా సాగి ప్రతి ఒక్కరినీ అలరించాయి.ఈ వేడుకల్లో మెయిన్ హైలైట్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సందడే. అమెరికాలో ఇంత భారీ ఎత్తున బతుకమ్మ చేయడం చూసి ముగ్ధుడైన ఆయన, వేదికపైకి వచ్చి గంటపాటు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తన మార్క్ కామెడీ పంచ్‌లతో నవ్విస్తూనే, అక్కడున్న యూత్‌తో పాటు పిల్లలను కూడా స్టేజ్ మీదికి పిలిచి వారితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. నవీన్ ఎనర్జీకి ఆడిటోరియం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయింది.