తెలంగాణ

సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బిగ్‌షాక్ ఇచ్చింది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభా సభ్యులను సస్పెండ్ చేయించిన ప్రభుత్వం.. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సమావేశాలను కొనసాగిస్తున్నది. ప్రజాసమస్యలపై తాము ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నిన్నకీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏ,ఫీజు రీయింబర్స్‌మెంట్, జీవో 97, యూరియా, సాగు నీరు, గోదావరి కృష్ణా జలాల దోపిడీ అంశంలో ప్రశ్నిస్తామనే భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సీఎం రేవంత్.. తన తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో కేటాయించిన టెస్సరాక్ట్ భూముల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఆర్థిక, భూ దోపిడీని ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడానికే వెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.