టాప్ న్యూస్
ఉగ్ర లింకులు.. రామగుండంలో ఎన్‌ఐఏ సోదాలు.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్!
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర సంచలనం సృష్టించాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. రామగుండానికి చెందిన ముజామిల్ ఖాన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థికి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్‌లతో అండర్‌గ్రౌండ్ లింకులు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది.
