తెలంగాణ

సేవ్ డెమోక్రసీ ఉద్రిక్తం.. మంత్రులు, నేతల అరెస్టు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ 'సేవ్ డెమోక్రసీ' పేరిట నగరంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు సంయుక్తంగా ఆందోళనా కార్యక్రమం చేపట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు గురువారం భారీ ర్యాలీ చేపట్టారు.కాంగ్రెస్, వామపక్ష నేతలు కలిసి నెక్లెస్ రోడ్ మీదుగా లోకభవన్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అయితే, నిరసన కారులు లోక్‌భవన్‌కు చేరుకోకుండా నెక్లెస్ రోడ్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు మంత్రులు, నేతలను అరెస్టు చేశారు.