అమెరికాలో తెలుగు యువకుడికి 50 నెలల జైలు శిక్ష!
ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్ అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అక్కడ తనకు సాయం కోసం స్వరాష్ట్రానికి చెందిన మరో వ్యక్తిని పిలిపించుకుని టార్చర్ చేసిన కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో అమెరికా ఫెడరల్ కోర్టు వెంకటేశ్ రెడ్డికి 50 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకివెళితే.. ఏపీలో వైసీపీ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్న సత్తారు వెంకటేశ్.. మిస్సోరిలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. అక్కడ పని ఉందని మరో వ్యక్తిని ఏపీ నుంచి రప్పించుకున్నాడు. అక్కడ సదరు వ్యక్తి సరిగ్గా పని చేయలేదనే నెపంతో విద్యుత్ తీగలు, పీవీసీ పైపులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా అతను బయట ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇతరులతోనూ తీవ్రంగా దాడి చేయించినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనలో మానవ అక్రమ రవాణా , బలవంతపు కార్మికుల చట్టాల ఉల్లంఘన, తీవ్ర భౌతికదాడుల అభియోగాలతో పాటు ఫెడరల్ ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అరాచకానికి పాల్పడిన వెంకటేష్ రెడ్డికి 50 నెలల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించింది.
