తెలంగాణ

Telugu States DebtCrisis: అప్పుల సునామీలో తెలుగు రాష్ట్రాలు.. భవిష్యత్తు దివాలా దిశగానేనా?

Telugu States DebtCrisis: ప్రజా సంక్షేమం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ప్రమాదకరమైన అంచుకు చేరుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఉచిత హామీలు, పథకాల అమలు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలను కొల్లగొడుతున్నాయి. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో ఏకంగా 62 శాతం కేవలం జీతాలు, పింఛన్లు, వడ్డీలు, ఉచిత పథకాలకే సరిపోతుండటం ఆర్థిక నిపుణులను నివ్వెరపరుస్తోంది. అప్పు తెచ్చి మరీ సంక్షేమం పంచడం అనే ప్రమాదకర విధానం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో పాలన సాగించడం కూడా అసాధ్యంగా మారి రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితులు తప్పవన్న తీవ్ర హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా అప్పుల వేగం మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మినహా, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించే దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.