Telangana Politics: అసెంబ్లీలో కాళేశ్వరం గుట్టు.. ఆ రూ.4,193 కోట్లపై రేవంత్ బిగ్ స్కెచ్!
Telangana Politics: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ కుంగుబాటు మొదలుకుని నిధుల వరద వరకు ప్రతి అంశమూ తీవ్ర దుమారాన్నే రేపింది. అయితే, ఇన్నాళ్లూ విమర్శలు, విచారణలకే పరిమితమైన కాళేశ్వరం వ్యవహారంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దూకుడు పెంచింది. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, పాలనాపరంగా ప్రాజెక్టును దారిలో పెడుతూనే.. రాజకీయంగా ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఒక భారీ ‘స్పెషల్ స్కెచ్’ సిద్ధం చేసింది.కాళేశ్వరం మరమ్మతుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నవంబర్ నెలాఖరులో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సభ వేదికగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణంలో జరిగిన సాంకేతిక తప్పిదాలు ఏమిటి?,
