స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana: కొంగర ఖుర్ద్‌లో భూ బీభత్సం ఎవరిది?

తెలంగాణ భూ చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కోర్టులు కేసును బట్టి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టుకు సమర్పించే పేపర్స్ ఒరిజినలా, ఫేకా గుర్తు పట్టలేని పరిస్థితులు ఉన్నాయి. వాటికి తోడుగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఫుల్ బెంచ్‌లు కామన్ ఆర్డర్స్‌తో టైటిల్ లేకుంటే ఏనాటికైనా టైటిల్ దారుడుకే చెందుతుందని కొన్ని కేసుల్లో తీర్పులు ఇవ్వడంతో భూ వివాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. వీటికి తోడుగా ఇనాం చట్టాలు, పీటీ దారుల హక్కులు, అర్బన్ సిలింగ్ యాక్ట్ ఎత్తివేయడంతో 70 ఏండ్ల క్రితం నాటి టైటిల్ దారులు పుట్టుకొస్తున్నారు. దశాబ్దాల నుంచి పొజిషన్‌లో ఉన్నా కూడా, ఆ ఆస్తి నీది కాదని నోటీస్ ఇస్తే చాలు ఆ క్షణం నుంచి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ అండదండలు ఉంటే ఎలాంటి స్టాండెండ్ ఆపరేటివ్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండానే కబ్జాలు చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు.