తెలంగాణ
భూభారతి ఆపరేటర్ల గోడు పట్టించుకునేదెవరు?
15 నెలలుగా జీతాలు అందక భూభారతి ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తో పాటు పలు రెవెన్యూ సేవల్లో కీలకంగా పనిచేస్తున్న తమకు 2025 మార్చి నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదంటున్నారు. మరోవైపు ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేసి, రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసి తమనే కొనసాగించాలని భూభారతి ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
