తెలంగాణ
పోరాడితే పోయేదేముంది.. పొంగులేటి ప్రొహిబిటెడ్ తప్ప!..
తెలంగాణలో భూ వివాదాలు ఓ పట్టున అర్ధం కావు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. ఇరుక్కుంటే దివాలా తీస్తారు. అలాంటి భూములపై నేరుగా సర్కారే ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎలాంటి తప్పులు దొర్లని 14 లక్షల 25 వేల ఎకరాల భూములను ప్రొహిబిటెడ్లో పెట్టింది. దీంతో ప్రతి జిల్లాలో 40 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు నిషేధంలోకి వెళ్లాయి. ఒక్క పటాన్ చెరులోనే 50 వేల ఎకరాలు ఉండడంతో హరీశ్ రావు పెద్ద ఎత్తున వెంటనే రియాక్ట్ అయ్యారు.
నియోజకవర్గాల వారీగా బాధితుల గోడు వినేందుకు రంగంలోకి దిగారు.
