తెలంగాణ
ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..
నెల రోజుల క్రితం రవ్వంతగా మొదలైన 22ఏ సమస్య.. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది! ఈ వ్యవహారంపై మొదటి నుంచీ ఫైట్ చేసింది స్వేచ్ఛ న్యూస్. అధికారుల అక్రమ వ్యవహారాలను ఆధారాలతో పసిగట్టి, పట్టుదలతో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ధరణి బిడ్డే భూభారతి.. దగా మాత్రం సేమ్ టు సేమ్ అంటూ నెల రోజుల క్రితమే స్వేచ్ఛ న్యూస్ హెచ్చరించింది. ‘ధరణి దగా.. భూభారతి హారతి’ అంటూ క్యాంపెయిన్ నడిపింది. ఇప్పుడు అదే అంశం పొలిటికల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఆధారాలు.. కావాల్సిన వారికి కోకొల్లలుగా ఇస్తాం. ఇదే స్వేచ్ఛ న్యూస్ ఫైట్!
