రాజకీయాలు
షబ్బీర్ అలీకి షాకిచ్చిన గ్రామస్తులు!..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులపై చర్చ జరుగుతున్న వేళ.. మెదక్ జిల్లాలో షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో గ్రామస్తులు భారీగా తరలివచ్చి గెస్ట్‌హౌస్ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారు. తమ పంట పొలాలకు వెళ్లే శతాబ్దాల నాటి దారిని మూసివేశారని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
