తెలంగాణ

Telangana: టామ్ అండ్ జెర్రీ రాజకీయాలు-తెలంగాణలో మారుతున్న సమీకరణాలు!!..

ప్రతిరోజు కయ్యమే అంటే... ప్రజలకు కూడా అసహ్యమే.. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ తీరు చూస్తుంటే సామాన్యుల నుంచి వస్తున్న ప్రధానమైన అభిప్రాయం ఇదే అని తెలుస్తుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆలోచన లేదు... ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు పదునైన వ్యూహం లేదు... మధ్యలో ఉన్న బీజేపీకి సరిపడా బలం లేదు. అసలు తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఓ దిశా నిర్దేశమే లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు, బీజేపీ బలహీనతల మధ్య ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోవడం. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆస్తుల పంచాయితీలు, పాత కేసుల ప్రస్తావనలతో రాజకీయాలు మతితప్పినట్టు సాగుతున్నాయని అంటున్నారు.