తెలంగాణ
కాలం మారింది.. కథ మారిందా? కేసీఆర్-ఈటల పాత లెక్కలు!!..
రాజకీయాల్లో కాలం మారితే.. పాత కథలకూ కొత్త అర్థాలు వస్తుంటాయి! ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో జరిగిన పరిణామాలు, అప్పటి నిర్ణయాలు.. ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. దీంతో అప్పటి లెక్కలు ఏంటి? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అవి ఎందుకు చర్చగా మారాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. కేసీఆర్ భూముల వ్యవహారంపై రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
