తెలంగాణ
పనులు కాలేదు.. పైసలు పాయే?.. అయ్యో.. ఇరుక్కుపోయామే?..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ రియల్ ఎస్టేట్ ఫైల్స్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించిన రియల్టర్లు, కొంతమంది నేతలు ఇప్పుడు ఇరుక్కుపోయారనే ప్రచారం జరుగుతోంది. అడ్వాన్సులు, అగ్రిమెంట్లతో ముందుకెళ్లిన వ్యవహారాలు చివరి దశలో ఆగిపోవడంతో డబ్బుల కోసం తిరుగుతున్నారన్న సమాచారం. మరోవైపు భూ వ్యవహారాలపై ప్రతిపక్షాలకు అంతర్గత సమాచారం చేరుతుండటం ప్రభుత్వ పెద్దలకు కొత్త తలనొప్పిగా మారుతోంది. అధికారులు రికార్డులు మార్చేందుకు వెనుకడుగు వేస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందనే చర్చ సాగుతోంది. మొత్తంగా రియల్ ఎస్టేట్పై ఆధారపడిన నేతలు, రియల్టర్ల భవిష్యత్ వ్యూహాలు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల మధ్య చిక్కుకున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
