తెలంగాణ

పూర్ణాహుతితో పరిసమాప్తమైన మహా వరుణ యాగం.. వేదఘోషతో మార్మోగిన కృష్ణాతీరం!..

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని.. కృష్ణా, గోదావరి నదులు జలకళతో ఉప్పొంగాలని.. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాలని.. రైతుల పంటలు పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ముగిసింది.

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది తీరంలో సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ యాగం.. రోజంతా వేద క్రతువులు, ప్రత్యేక పూజలు, హోమాలతో కొనసాగింది. సాయంత్రం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.