తెలంగాణ
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరవడిన అధికారుల నిఘా!.. వైరాలో భారీ దందా..
పేదల కడుపు నింపాల్సిన రేషన్ సన్నబియ్యం.. అక్రమ వ్యాపారుల జేబులు నింపుతోంది.. వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గన్నవరం, పెద్దమునగాల కేంద్రాలుగా బియ్యాన్ని సేకరించి, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా.. అక్రమ దందాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
