తెలంగాణ

ఊహించని మలుపు తిరిగిన ఓటుకు నోటు కేసు!..

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది.. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటు కోసం డబ్బు ఇవ్వజూపారన్న ఆరోపణలతో అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలోనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. కాగా గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన కారణంగా..న్యాయ ప్రక్రియ నిబంధనల ప్రకారం.. పాత బెంచ్‌లో విన్న వాదనలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకోలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి ఓటుకు నోటు కేసును విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.