తెలంగాణ
Telangana: దసరా సందర్భంగా TGSRTC బంపరాఫర్-ప్రయాణికుల కోసం అందుబాటులోకి కొత్త సేవలు..
దసరా పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఒకే ప్రాంతానికి వెళ్లే 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూపుగా బుకింగ్ చేసుకుంటే.. వారి ఇంటి వద్దకే ప్రత్యేక బస్సును పంపి పికప్ చేసే సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో, టాక్సీ ఖర్చులతో పాటు సమయం కూడా ఆదా కానుంది. కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు విద్యార్థుల కోసం కాలేజీలు, హాస్టళ్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఇందుకోసం ఏరియాల వారీగా ప్రత్యేక నంబర్లను ఆర్టీసీ ప్రకటించింది.
