తెలంగాణ
దానం దెబ్బతో కడియంలో టెన్షన్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పొలిటికల్ హీట్!!..
దానం నాగేందర్‌పై అన్హరత వేటు పడటంతో ఇప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి టెన్షన్ పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన కూడా పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలు ఉన్నట్టు న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో ఆ కేసు విచారణకు రానుంది. అప్పుడు కడియం సభ్యత్వం సైతం రద్దు చేస్తూ ఉన్నత న్యాయ స్థానం తీర్పువెలువరిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
