తెలంగాణ

షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. వీటిపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం రద్దు చేసింది. 2014 నుంచి ఇచ్చిన 8 జీవోలను సవాల్ చేస్తూ ఓ లాయర్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని, దీనిని పిల్ కింద చూడలేమని ఏజీ వాదించారు. ఇలాంటి ప్రభుత్వ విధానాలపై విచారణ సింగిల్ జడ్జి పరిధిలోకి రాదని చెప్పారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆ స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.