తెలంగాణ
Telangana: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!!..
తెలంగాణ కేబినెట్ భేటీలో ఉద్యోగులు, రైతులు, కరువు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయడంతో పాటు బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
