తెలంగాణ

Telangana: బీసీ ఓటు బ్యాంక్‌పై టీడీపీ కన్ను.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?..

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా బలహీన పడి తన ఉనికిని కోల్పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ బలం కూడా నిలబడలేదు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్‌లో చేరడంతో 2016 నాటికే అసెంబ్లీలో టీడీపీ బలం మూడు స్థానాలకు పడిపోయింది.. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీకి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.