తెలంగాణ
రైతు బీమాకు బ్రేక్.. ఇక వారికి మాత్రమే ప్రభుత్వ సాయం!
తెలంగాణ రైతులకు కీలక సమాచారం.. రైతు బీమా పథకం గడువు ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ఆగస్టు 13న లేదా అంతకంటే ముందు మరణించిన అర్హులైన రైతుల క్లెయిమ్‌లను మాత్రమే అధికారులు నమోదు చేయనున్నారు. అయితే, ఆగస్టు 13 తర్వాత జరిగిన మరణాలకు ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించవద్దని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. క్లెయిమ్ నమోదు చేసే ముందు రైతు మరణించిన తేదీని ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డుల ద్వారా అధికారులు కచ్చితంగా పరిశీలించనున్నారు.
