తెలంగాణ

Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..

SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.. ఇక తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారి (BLO) నోటీసులు జారీ చేశారు. మంత్రి ఓటర్ గుర్తింపు కార్డులో ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదు కావడమే దీనికి కారణంగా తెలుస్తుంది..