తెలంగాణ
సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా!?.. ప్రజా పాలనలో రైతు ఆవేదన..
మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం ఓ వృద్ధ రైతు.. సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ రైతు వేడుకోవడం హృదయాలను కలచివేస్తుంది. ఇక పంట వేసిన రైతుకు నీరు, విత్తనం, ఎరువు.. ఇవన్నీ సమయానికి అందచేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి.. ప్రస్తుతం యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితులు తలెత్తాయని రైతులు వాపోతున్నారు. ఎరువు కోసం పొలాన్ని వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
