తెలంగాణలో సర్ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల్లో మార్పులు లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈ గడువులోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ప్రజలకు మరింత సమయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.
