తెలంగాణ

Telangana SIR 2026: లెక్క క్లియర్.. పట్నం కన్నా పుట్టిన ఊరే ముఖ్యమని కుండబద్దలు కొట్టిన తెలంగాణ ఓటర్లు

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్ (ఎన్యూమరేషన్) ప్రక్రియ పూర్తైంది. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటికి 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశామని, నమోదు ప్రక్రియ 78.30 శాతానికి చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఓవరాల్ చూస్తే.. పట్నం కన్నా పుట్టిన ఊరే మాకు ముఖ్యం అని తెలంగాణ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. పట్నంతో పోలిస్తే గ్రామీణ జిల్లాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ డిజిటలైజేషన్ 80 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తవటం విశేషం. ఓటర్లు తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేసుకున్నారు.