తెలంగాణ
TG: హైకోర్టు చెప్పినా రైతు బీమా ఇవ్వరా?
TG: హైకోర్టు స్వయంగా ఆర్డర్ ఇచ్చినా రైతు బీమా డబ్బులు ఇవ్వకుండా అధికారులు లేట్ చేస్తుండటంతో ఓ బాధిత మహిళ నేరుగా రంగంలోకి దిగింది. తనకు న్యాయంగా రావాల్సిన రైతు బీమాను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.సంస్థాన్ నారాయణపురం మండలం గోగులోనిభావికి చెందిన కళ్లెం మంజుల అనే మహిళ.. తన లాయర్ గుమ్మి రాజ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత మన్నె నర్సింహారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి, జాన్ రెడ్డిలను వెంటబెట్టుకుని బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ ఐఏఎస్‌ను కలిశారు.
