National

rice price hike: తెలంగాణలో ‘ఎల్‌నినో’ పేరుతో వ్యాపారుల దోపిడీ.. పట్టించుకోని ప్రభుత్వం..!

rice price hike: నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వంటింట్లో అన్నం ముద్ద దిగకుండా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లో సూపర్ ఫైన్ రకం సన్న బియ్యం కిలో ధర ఏకంగా రూ.90 నుంచి రూ.95కు చేరుకుంది. ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే కిలో వంద రూపాయల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. కేవలం ఒక్క వారంలోనే 25 కిలోల బస్తాపై రూ.450 వరకు పెంచేయడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.జూలై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ నాటికి ఊహించని స్థాయికి చేరాయి. ప్రీమియం రకంగా పేరున్న 'జై శ్రీరామ్' రకం బియ్యం జూన్‌లో క్వింటాల్ ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా, ప్రస్తుతం క్వాలిటీని బట్టి ఏకంగా రూ.8,400 నుంచి రూ.9,200 వరకు పలుకుతోంది.